మాయాబజార్ ఎందుకు క్లాసిక్ అయింది? అప్పట్లో అప్పటివారిని మెప్పించిన ఆనాటి మేటి సినిమా ఈ సినిమా ఇప్పటికి ఓ అద్బుతమే భవిష్యత్తులో కూడా ఈ సినిమా గొప్పగానే కనబడుతుంది. ఇది మన తెలుగువారికి గర్వం… కెవి రెడ్డిగారు అందించిన గర్వం. మాయాబజార్: 70+ ఏళ్ల తర్వాత కూడా ఎందుకు ఈ సినిమా “ఎప్పటికీ ట్రెండ్” అవుతోంది?
Mayabazar తెలుగు సినిమా చరిత్రలో కేవలం ఒక సినిమా కాదు… ఇది ఒక సాంస్కృతిక అద్భుతం. 1957లో విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే రేటింగ్స్ పెరిగిపోతాయి. కొత్త తరానికి కూడా ఇది “ఫ్రెష్ క్లాసిక్”లా అనిపించడం విశేషం.
మాయాబజార్ ఎందుకు క్లాసిక్ అయింది? కధలోకి వెళ్తే!
పురాణం తెలిసినవారందరికి తెలిసినదే బలరాముడు, కృష్ణుడు, అన్నదమ్ములు… వారికి గల చెల్లెలు సుబద్ర అర్జునుడి భార్య… ఈ కధ బలరాముని కూతురు శశిరేఖ, అర్జునుడి కొడుకు అయిన అభిమన్యుల మద్య ప్రేమ చిగురించడంతో ప్రారంభం.
సుబద్ర పుట్టింటికి తన కొడుకు అభిమన్యుడితో వస్తుంది. ద్వారకాలో శశిరేఖ, అభిమాన్యులు కలసి మెలసి ఉంటారు. వారిని చూసి ముచ్చటపడ్డ సుబద్ర, వారిద్దరికీ పెండ్లి చేయాలనీ, బలరాముడి దగ్గర మాట తీసుకుంటుంది. ఆపైన సుభద్ర, అభిమన్యుడు ఇంద్రప్రస్థానికి తరలి వెళ్ళిపోతారు.
ఇంద్రప్రస్థం నుండి వెనుతిరిగి వచ్చిన, ఒక బహుమతిని సావిత్రికి ఇస్తాడు, అదే ప్రియదర్శిని. అందులో చుసినవారికి, వారి మనసులో ఉన్న కోరికకు సంబందించిన వస్తువులు లేదా వ్యక్తులు కనబడతారు. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ అభిమాని అయితే, మీరు ఆ ప్రియదర్శిని పెట్టె తెరిచి చూస్తే, అందులో ఎన్టీఆర్ కనబడతాడు… ఆ పెట్టిని తెరిచినా శశిరేఖకు తన ప్రియుడైన అభిమన్యుడు కనిపిస్తాడు.
రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని చూసి, అసూయచెందే దుర్యోధనుడికి శకుని, అతని మనసులో ఉన్న కుతంత్రం చెబుతాడు. తన పాచికల విద్య ప్రదర్శించి, జూదంలో పాండవులను ఓడిద్దామని సలహా ఇస్తాడు. ఈ విషయంలో దుష్టచతుష్టయం ఏకాభిప్రాయానికి వస్తారు.
శకుని మాయా జూదంలో పాండవులు రాజ్యాన్ని, సంపదనీ, తమనీ, చివరికి ద్రౌపదిని కోల్పోయారని, శ్రీకృష్ణుడు ద్వారకలో బలరామనికి చెబుతాడు. అప్పుడు బలరాముడు దుర్యోధనుడు తన శిష్యుడు, తన మాట వింటాడు… పాండవుల రాజ్యం తిరిగి ఇప్పిస్తానని శ్రీకృష్ణునితో చెప్పి, బలరాముడు హస్తినకు బయలుదేరతాడు.
బలరాముడు హస్తినకు, అది దుర్యోధనుడి దగ్గరకు వస్తున్న విషయం తెలుసుకున్న దుష్టచతుష్టయం…. ఒక పన్నాగం పన్నుతారు. బలరాముడిని బాగా పొగిడి, అతని దగ్గర మాట తీసుకోవాలని ప్రణాళిక సిద్దం చేసుకుంటారు.
అనుకున్న ప్రణాళిక ప్రకారం, దుష్టచతుష్టయం బలరామునికి మర్యాదలు చేసి, ముఖస్తుతి చేసి, పాండవుల మీద ద్వేషం కలిగేల మాట్లాడతారు. ఆపై బలరాముని కూతురు శశిరేఖ, దుర్యోధనుడు కొడుకు లక్ష్మణ కుమారునికి వివాహం చేద్దామని, బలరాముడి దగ్గర మాట తీసుకుంటారు.
పాండవులు కనబడకుండా పాండవుల కధతో
పాండవులు రాజ్యం కోల్పోయి 12 ఏళ్ళ వనవాసానికి వెళ్ళడంతో, సుభద్ర అభిమన్యుడితో సహా తన పుట్టిల్లు – ద్వారక తిరిగి వస్తుంది. అలా వచ్చిన సుబద్రకు అన్నగారు శ్రీకృష్ణుడు, రుక్మిణి నుండి లభించిన ఆదరణ, బలరాముడు, రేవతి దగ్గర లభించదు.
తన కూతురు శశిరేఖ, బావ అభిమన్యుడితో తిరగకుండా కట్టడి చేయడం ప్రారంభిస్తుంది, అయినా శశిరేఖ, అభిమాన్యులు వీరి కన్నుగప్పి విహరిస్తూనే ఉంటారు. శశిరేఖను దుర్యోధన చక్రవర్తి కుమారుడు లక్ష్మణ కుమారునికి ఇచ్చి వివాహం చేసేందుకు వాగ్దానం చేసినట్టు బలరాముడు, రేవతి ద్వారకాలో చెబుతారు. అందుకు శశిరేఖ, సుభద్ర, అభిమన్యుడు ప్రతిఘటించినా, కృష్ణుడు మాత్రం అప్పటికి అన్నగారి పక్షమే అయినట్టగా ఉంటాడు. సుభద్ర, అభిమన్యులు ద్వారక విడిచి వెళ్ళడానికి నిశ్చయించకుంటారు. అయితే కృష్ణుడు రహస్యంగా దారుకునికి వీరిద్దరినీ అడవిలోని ఘటోత్కచుని ఆశ్రమానికి తీసుకుపొమ్మని ఉపదేశిస్తాడు.
భీమసేనుడు కుమారుడు అయిన ఘటోత్కచుడు పరిసరాలకు అభిమన్యుడు రాగానే, ఘటోత్కచుని అనుయాయులు యుద్ధం చేస్తారు…. వారిని ఓడించిన అభిమన్యుడితో ఘటోత్కచుడు యుద్దానికి వస్తాడు… ఆ యుద్ధంలో అభిమన్యుడు తన సోదరుడే అని తెలిసుకుని, ఘటోత్కచుడు సుబద్రను క్షమాపణ కోరతాడు. తర్వాత వారిని, తన తల్లి హిడింబి వద్దకు తీసుకువెళతాడు. వారిద్దరికీ అతిథి సత్కారాలు జరిపించాకా, సుభద్రకు జరిగిన అవమానాన్ని తెలుసుకుని శశిరేఖను తీసుకువచ్చేందుకు ద్వారకకు బయలుదేరుతాడు.
రాత్రివేళలో ద్వారకకు చేరుకున్న ఘటోత్కచుడు శ్రికృష్ణుడి మాయకు ఆశ్చర్యపడతాడు. తర్వాత శ్రీకృష్ణుని ఆశీర్వాదం తీసుకుని, శశిరేఖను అక్కడి నుండి, తన ఆశ్రమానికి తీసుకువెళతాడు. తర్వాత తానే మాయ శశిరేఖగా మారి అక్కడ ఘటోత్కచుడు అందరి ఆట కట్టిస్తాడు.
మాయాబజార్ కథలో ఉన్న అసలు మాయ ఏమిటి? మాయాబజార్ ఎందుకు క్లాసిక్ అయింది?
ఈ సినిమా మహాభారతంలోని పాత్రలను తీసుకుని చాలా చక్కగా పాత్రలను మలిచారు. ముఖ్యంగా ఘటోత్కచుడుగా ఎస్వి రంగారావు గారు, శశిరేఖగా సావిత్రి గారు, కృష్ణుడుగా nt రామారావు గారు అద్బుతంగా నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమన్యుడు పాత్రలో నటించారు.
కథలో ముఖ్యంగా:
- అభిమన్యుడు – శశిరేఖ ప్రేమ కథ
- దుర్యోధనుడి కుట్ర
- శ్రీకృష్ణుని తెలివైన మాయాజాలం
- ఘటోత్కచుడి శక్తివంతమైన పాత్ర
మాయాబజార్ సినిమా ఆద్యంతం అప్పుడు ఇప్పడు ఇంకా ఎప్పుడూ కూడా ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. అందుకే మాయాబజార్ ఎందుకు క్లాసిక్ అయింది.
సంగీతం – ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ క్లాసిక్
ఘంటసాల సంగీతం ఈ సినిమాకు ప్రాణం.
- పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ పొందుతున్నాయి
- “లాహిరి లాహిరి లాహిరి లో” లాంటి పాటలు ప్రతి జనరేషన్ వినేలా ఉన్నాయి
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను మరింత ఎమోషనల్‌గా మారుస్తుంది
1957లోనే VFX అద్భుతం ఎలా సాధ్యమైంది?
ఈ సినిమా ప్రత్యేకతే దాని టెక్నికల్ ఇన్నోవేషన్.
- ఘటోత్కచుడి సైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్
- మాయా పాలస్ సెట్ డిజైన్
- లైటింగ్ మరియు కెమెరా వర్క్
ఇవి చూసినప్పుడు ఇది 1957 సినిమా అని నమ్మలేం.
మాయాబజార్ నుండి నేర్చుకోవాల్సిన విషయాలు
- మంచి కథ ఎప్పటికీ పాతబడదు
- టెక్నాలజీ లేకపోయినా క్రియేటివిటీ ఉంటే అద్భుతాలు చేయొచ్చు
- క్లాసిక్ సినిమాలు జనరేషన్ గ్యాప్‌ని బ్రిడ్జ్ చేస్తాయి
చివరి మాట
Mayabazar కేవలం సినిమా కాదు… ఇది తెలుగు సినిమా గర్వం. ప్రతి తరానికి ఒకసారి చూసి అనుభవించాల్సిన ఎమోషన్.
ఇప్పటికీ ఇది Googleలో సెర్చ్ అవుతుంటేనే అర్థమవుతుంది — క్లాసిక్స్ ఎప్పటికీ మరణించవు. మాయాబజార్ ఎందుకు క్లాసిక్ అయింది?
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.