సమంత కెరీర్ మార్చిన సినిమా కథ ఇదే! సాదారణంగా రొమాంటిక్ మూవీస్ యువతను బాగా ఆకర్షిస్తాయి. అందులో ఫ్రెష్ నెష్ కు త్వరగా కనెక్ట్ అవుతారు. ఆ కోవలోకే Ye Maaya Chesave story in Telugu సినిమా 2010లో ధియేటర్లలో సందడి చేసిన ఒక అందమైన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాకు Gautham Vasudev Menon దర్శకత్వం. ఈ సినిమాలో Naga Chaitanya, Samantha Ruth Prabhu హీరో, హీరోయిన్లుగా నటించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ A. R. Rahman సంగీతాన్ని అందించారు.
కొత్త కధానాయకుడు నాగ చైతన్య, మొదటి చిత్రం జోష్, కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టూడెంట్ క్యారెక్టర్ లో చక్కగా నటించాడు… తర్వాత ఓ రొమాంటిక్ ప్రేమ కధలో నటించడం, అది యువతను బాగా ఆకట్టుకుంది. కొత్త కధానాయకి సమంతా, ఇది మొదటి సినిమా, కుటుంబంలో భయ భక్తుల మద్య ఉండే యువతి జెస్సి పాత్రలో చక్కగా నటించింది.
ప్రేమలో పడితే ఇలా ఉంటుంది, వాస్తవంగా కధ ఎక్కడో జరిగినట్టుగా నాగ చైతన్య – సమంతా నటన, ఈ ఇద్దరి జోడి ఈ సినిమాకి హైలెట్… వారి కెమిస్ట్రీ సినిమాకు బాగా వర్క్ అవుట్ అయ్యింది.
Ye Maaya Chesave story in Telugu కధలోకి వెళ్తే
కలలు కనే కుర్రకారు, ప్రేమలో పడి కెరీర్ పాడు చేసుకుంటారు. తమ కలలకు వారే కళ్ళెం వేసుకుంటారు. అందుకే పెద్దలు ప్రేమ అనగానే, వీడి జీవితం ఎటు పోతుంది? అని మధన పడుతూ ఉంటారు. అలాగే ఏం మాయ చేసావే సినిమాలో కదా నాయకుడు పాత్ర పేరు కార్తిక్, ఆ యువకుడు సినిమా దర్శకుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. అతను సరదాగా, కొంచెం అల్లరి స్వభావంతో జీవిస్తుంటాడు.
సినిమా షూటింగ్లో ‘గ్రీన్ మ్యాట్’ వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా?
మతం వేరు అయినప్పుడు, ప్రేమ జయించడం జరగదు. ఎందుకంటే తమ నమ్మకాలకు అతీతంగా పెద్దలు ఆలోచన చేయరు. తమ నమ్మకాలే పిల్లల పాటించాలని కోరుకుంటారు. అలా ఈ ప్రేమ కధలో క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి జెస్సి, చూడగానే ఆకర్షించే ముఖం… ఆమెతో మాట్లాడకుండా ఏ కుర్రాడు ఉండగలడు? ఇక ప్రేమలో పడితే అంతే. కధలో ఆమె హీరో ఇంటిపై పోర్షన్లో జెస్సి అద్దెకు ఉంటారు. ఒక రోజు ఆ యువతిని (జెస్సీ) చూసి ప్రేమలో పడిపోతాడు. జెస్సీ చాలా సింపుల్, మృదువైన స్వభావం కలిగిన అమ్మాయి, ఆమెకు కూడా అతను అంటే ఇష్టం కానీ బయటపడదు.
కార్తిక్ జెస్సికి ప్రపోజ్ చేస్తాడు, జెస్సి తిరస్కరిస్తుంది. ఆమె కేరళలో తన ఊరికి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకుని, కార్తిక్ కూడా కేరళ బయలుదేరతాడు. అక్కడ అతను ఆమెకు క్షమాపణ చెప్పి, ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందాం అని అంటాడు. ఆమె అతనిని తన కుటుంబానికి ఒక క్లాస్ మేట్ గా పరిచయం చేస్తుంది.
కానీ ఓ కొత్త కుర్రాడు, రాష్ట్రం దాటి వచ్చి ఇక్కడ తిరగడం వారికి అనుమానస్పదంగా ఉంటుంది. అందులో జెస్సి అన్నయ్యకు ఈ సందేహం ఎక్కువగా ఉంటుంది.
అనుకోకుండా ఒక రోజు ట్రైన్లో వారిద్దరూ ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్తిక్ జెస్సి పెదాలను ముద్దాడుతాడు. జెస్సి కార్తిక్ తో గొడవ పడుతుంది. వీరిద్దరి గురించి సందేహపడుతున్న జెస్సి బ్రదర్, కార్తిక్ తో గొడవపడతాడు.
agra darshakua prasamalu pondina aite
Ye Maaya Chesave story in Telugu కధలో జెస్సి డోలాయమానం స్థితిలో ఉంటూ ఉంటుంది. మొదట్లో కార్తీక్ ను ఒప్పుకోదు, కానీ కార్తీక్ స్నేహం చేద్దాం అంటే ఒప్పుకుంటుంది. కార్తిక్ ముద్దిస్తే, మండిపడుతుంది. కాని ఇంట్లో పెళ్లి అంటే వద్దు అంటుంది. జెస్సి బ్రదర్ తో సహా జెస్సి కుటుంబ సభ్యుల అందరికి కార్తిక్, జెస్సి బంధం గురించి తెలిసి, జేస్సికి పెండ్లి ఏర్పాట్లు చేస్తారు. ఆమె ఇంట్లోవారితో పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తుంది. ఈ ప్రేమ విషయం తెలిసిన తర్వాత, ఆమె అన్నయ్య మరియు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కార్తిక్‌ను దూరంగా ఉండమని హెచ్చరిస్తారు.
మొదట్లో జెస్సీ కార్తిక్‌ను కేవలం స్నేహితుడిగానే చూస్తుంది. కానీ కార్తిక్ ఆమెను నిజంగా ప్రేమిస్తుండటంతో, ఇద్దరి మధ్య బందం బలపడుతుంది. కార్తిక్ మరల జెస్సి వద్దకు వస్తాడు. అప్పుడు జెస్సి తన మనసులో ఉన్న నిజం ఏమిటో, తన ఫీలింగ్స్ కార్తిక్ తో పంచుకుంటుంది.
కార్తిక్ –జెస్సి ప్రేమలో మునిగిపోతారు. కొంతకాలం తర్వాత జెస్సీ తన కుటుంబ ఒత్తిడితో కార్తిక్‌కు దూరమవుతుంది. దీంతో కార్తిక్ తీవ్ర నిరాశకు గురవుతాడు. తన బాధను సినిమాల రూపంలో వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను దర్శకుడిగా మారే ప్రయత్నం ప్రారంభిస్తాడు.
OTT Lo Sandadi chestunna cinemalu
కొంతకాలం తర్వాత కార్తిక్ ఒక సినిమా దర్శకుడిగా ఎదుగుతాడు. కాని అతని జీవితంలో జెస్సీ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి. చివర్లో జెస్సీ మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది. వారి ప్రేమ చివరకు కలిసిందా? లేదా? అనే భావోద్వేగ ముగింపుతో సినిమా ముగుస్తుంది.
మొదట్లో చెప్పినట్టు, కల కన్న కుర్రోళ్ళు, అమ్మాయి వలపులో పడి కెరీర్ పై దృష్టిపెట్టలేరు. Ye Maaya Chesave story in Telugu కధలో మాత్రం హీరో తన ప్రేమ ఫెయిల్ అనుకుని కెరీర్ పోగొట్టుకోడు… కెరీర్ లో సక్సెస్ సాధిస్తాడు. తర్వాత తన ప్రేమరాణితో సంతోషంగా జీవిస్తాడు. యువత భావోద్వేగాలు, విబిన్న పరిస్థితులు మద్య ఈ ప్రేమ కధ చక్కగా ఉంటుంది. తెలుగు ప్రేమకథ సినిమా ఏ మాయ చేసేవే…
ఈ సినిమా youtube లో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సినిమా ప్రత్యేకతలు
- సహజమైన ప్రేమకథ వలె ఉంటుంది
- అద్భుతమైన సంగీతం ఈ సినిమాలో సైలెంట్ గా సందడి చేస్తూ ఉంటుంది.
- కార్తిక్–జెస్సీ మధ్య భావోద్వేగ రొమాంటిక్ సన్నివేశాలు
- Hosanna, Vintunnava వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి
- Samantha Ruth Prabhu కి ఇది తొలి తెలుగు సినిమా
- ఇది తొలిసారి కలసి నటించిన నాగ చైతన్య సమంత సినిమా
ఈ చిత్రం యువతలో ప్రేమ భావాలను చాలా సహజంగా చూపించిన క్లాసిక్ లవ్ స్టోరీగా ఇప్పటికీ గుర్తింపు పొందింది. Ye Maaya Chesave story in Telugu యువతి యువకుల ప్రేమలో, వారికి పరిస్థితులు కల్పించే కష్టాలు, ఆ కష్టాలలో వారి భాధ, ఎడబాటు, వారిలో విరహం, ఓ అందమైన ప్రేమ కధ….