చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా కథ

మెగాస్టార్ చిరంజీవి నటించిన Gang Leader సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గొప్పగా సందడి చేసింది. ఇది తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మాస్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటి. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా కథ ఇప్పటికి ఆసక్తికరమే. దర్శకుడు Vijaya Bapineedu తెరకెక్కించిన ఈ సినిమాలో Chiranjeevi కి జతగా విజయశాంతి నటించగా, సూపర్ హిట్ పాటలు గల ఈ సినిమాకి Bappi Lahiri సంగీతాన్ని అందించారు. చిరంజీవి – విజయశాంతి కెమిస్ట్రీ, ఏక్షన్, సెంటిమెంట్, డ్రామా, సంగీతం అన్నింటిలోను గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా కథ

ఒక మద్యతరగతి కుటుంబం, ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు, వారిలో పెద్దవాడు రఘుపతి, రెండవవాడు రాఘవ, కనిష్టుడు రాజారామ్. అఖిరివాడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ, ఇంట్లో అల్లరిగా సందడి చేసే యువకుడు ఐతే పెద్దవాడు ఒక్కడే ఉద్యోగం చేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటాడు. మధ్యలో వాడు మాత్రం ఉన్నత చదువులు కోసం ఉత్తమ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఆ కుటుంబం యొక్క sangati.  rajaram కాలనీలో అందరికీ సహాయం చేస్తూ, స్నేహితులతో గడుపుతూ సంతోషంగా కాలం గడిపేస్తూ ఉంటాడు.

రాఘవ చదువు కోసం పాతిక వేలు అవసరం అయితే, ఆ డబ్బు ఎలా సమకుర్చాలి అనే విషయంలో రఘుపతి సతమతం అవుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక జైలు అధికారి కూతురు చేసిన ఆక్సిడెంట్ ను rajaram చూస్తాడు. వెంటనే ఆక్సిడెంట్ చేసిన కారు నెంబర్ ఆధారంగా, ఆ ఇంటికి వెళ్ళిన rajaram ku జైలు అధికారి ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో, ఆ ఆక్సిడెంట్ కేసుని తనపై వేసుకుని, జైలుకి వెళతాడు. దాంతో రాఘవ చదువుకు కావలసిన డబ్బులు సమకూరుతాయి.

ఏకాంబరం, కనకాంబరం అన్నదమ్ములు, ఇద్దరూ అక్రమాలు చేస్తూ, చేయిస్తూ ఉంటారు. సమాజంలో అధికారులను, పెద్దవాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని, తాము చేస్తున్న నేరాలకు దొరకకుండా బ్రతుకుతూ ఉంటారు. అలా వారు చేయించిన ఒక హత్యను, రఘుపతి కళ్లారా చూస్తాడు. తర్వాత ఆ విషయం పోలీసులకు ఫోన్ చేసే చెబుతాడు. కానీ ఆ పోలీస్ అధికారి ఏకాంబరం తొత్తుగా ఉంటాడు. తాము చేయించిన హత్యకు రఘుపతి sakshi అని ఏకాంబరం కు తెలియడంతో వారు రఘుపతిని చంపుతారు.

రఘుపతిని ఏకాంబరం, కనకాంబరం స్వయంగా చంపుతారు… ఆ హత్యను atani స్నేహితులు చూస్తారు. అందులో ఒకరు ఫోటోగ్రాఫర్ అవ్వడం వలన, ఆ దృశ్యాలను ఫోటోలు తీస్తాడు. అయితే ఏకాంబరం, కనకాంబరం గురించి తెల్సిన స్నేహితులు, రాజారామ్ ఆవేశం గురించి కూడా అలోచించి, రఘుపతి హత్య అనే విషయాన్ని rajaram దగ్గర దాస్తారు.

డ్రామా, సెంటిమెంట్ కలిసిన యాక్షన్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా కథ ఆసక్తికరం

జైలు నుండి hero తిరిగి రావడం, చదువు పూర్తీ చేసుకుని రాఘవ రావడం రెండూ ఆ కుటుంబంలో సంతోషం నింపినా, రఘుపతి లేని విషాదం ఆ కుటుంబంలో కనబడుతుంది. ఇంకా అది హత్య కాని ఆక్సిడెంట్ అని కుటుంబ సభ్యలు భావిస్తారు. ఐతే atani స్నేహితులు మాత్రం రఘుపతి హత్య గురించి మధనపడుతూ ఉంటారు.   

చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా కథలో ముఖ్యంగా , హత్యను చుసిన sakshi ని చంపడం, ఆ హత్యను చూసిన మరికొందరు సాక్షులు, వారిని చంపడం…. ఆ సమయానికి తన అన్న ఆక్సిడెంట్ కాదు హత్య అని rajaram కు తెలియడం… సినిమా కధలో ప్రేక్షకుడు లీనం అవుతారు.

ఇంకా ఆ హత్యలను మాఫీ చేసిన ఐజి కూతురు, రాజారామ్ అన్న రాఘవను పెళ్లిచేసుకోవడం సినిమా కధను మరింత రక్తికట్టిస్తుంది. తన పెద్దన్నను చంపిన వారి నుండి తన చిన్నన్నను కాపాడుకుని, ప్రతినాయకులను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా వారిని అంతం చేసాడు? తనతో సరదాగా చిందులు వేస్తూ సందడి చేసే హీరోయిన్ ఎవరు?

ఇలా సినిమా ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది.. పాటలు బాగుంటాయి. మాస్ ని మెప్పించే డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. “చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందొ?” డైలాగ్ చాలా పాపులర్. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి డాన్స్ చాలా క్లాస్ గా ఉంటుంది. మాస్ సినిమాలో చిరంజీవి యాక్షన్ అదిరిపోద్ది…

బప్పిలహరి అందించిన మ్యూజిక్ బాగుంటుంది, ఇప్పటికి పాటలు సేన్సేసన్. సండే అననురా,

ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం?

  • Chiranjeevi మాస్ స్టైల్, డ్యాన్స్, ఫైట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
  • “వాన వాన వెల్లువాయే” వంటి పాటలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. ఈ పాటకు రచ్చ సినిమాలో రామ్ చరణ్ స్టెప్స్ వేసారు.
  • అన్నదమ్ముల అనుబంధాన్ని భావోద్వేగంగా చూపించారు.
  • కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ కలిసిన పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
  • ఈ సినిమా తరువాత “గ్యాంగ్ లీడర్” అనే పదం Chiranjeeviకి ఒక ప్రత్యేక ఇమేజ్‌గా మారింది.
  • ఈ సినిమా టైటిల్ ఫాంట్ కూడా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు ఒకరు చిరంజీవి, అతని పాత్ర పేరు ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది… మరి మిగిలిన రెండు పాత్రల్లో నటించిన హీరోలు ఎవరు? కామెంట్ చేయండి.

గ్యాంగ్ leader సినిమా మరలా తీస్తే ఇప్పుటి హీరోలలో ఎవరు అయితే బాగుంటుంది? కామెంట్ చేయండి.

Leave a Comment