1994లో విడుదలై తెలుగు సినిమా థియేటర్లలో సందడి చేసిన Shubhalagnam, తెలుగు కుటుంబ కథా చిత్రాలలో ఒక క్లాసిక్గా గుర్తింపు పొందింది. ఈ సినిమాకు S. V. Krishna Reddy దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో Jagapathi Babu, Aamani, Roja ప్రధాన పాత్రల్లో నటించారు. కుటుంబ విలువలు, డబ్బు ప్రభావం, భార్యాభర్తల అనుబంధం వంటి అంశాలను చాలా భావోద్వేగంగా చూపించారు. స్టోరీ లైన్ Dabbu kosam bhartane ammeina bharya – డబ్బు పెట్టి పొరుగింటి భర్తను కొనుక్కున్న డబ్బున్న అమ్మాయి… డబ్బుతో ఏవైనా కొనొచ్చు కాని ప్రేమను ప్రేమతో గెలవాలి అని కుటుంబ కధతో వచ్చిన సినిమా శుభలగ్నం.
Dabbu kosam bhartane ammeina bharya శుభలగ్నం కథ ప్రారంభం
నిజాయితీ, నిబద్ధత, ఆర్థిక క్రమశిక్షణ కలిగిన మధు (జగపతిబాబు) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ వ్యక్తి. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్. అతను నిజాయితీగా పనిచేస్తూ తన భార్య మరియు పిల్లలను ప్రేమగా చూసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. అతని భార్య పేరు రాధ (ఆమని). ఆమె కూడా రాధ కూడా సాధారణ జీవితం గడుపుతూ భర్తను పిల్లలను చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది.
ఐతే రాధకు డబ్బున్న గొప్ప వ్యక్తి వలె జీవించాలనే కోరిక. అది కాస్త క్రమంగా డబ్బుపై అధిక ఆశ పెంచుతుంది. ధనవంతుల జీవితాన్ని చూసి తాను కూడా అలాంటి విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ పెంచుకుంటుంది. ఐతే మధు మాత్రం ప్రేమ, కుటుంబం, మనశ్శాంతి ముఖ్యమని భావిస్తాడు.
స్మార్ట్ఫోన్లో Best Camera కావాలంటే ఈ Features తప్పనిసరి! మీ ఫోనులో కెమెరా క్వాలిటీ?
కథలో మలుపు – దురాశతో దూరదృష్టి కోల్పోయిన రాధ
మధు పనిచేసే ఫ్యాక్టరీ ఓనర్ కూతురు లత, సింపుల్ గా ఉండే మధును ఇష్టపడుతుంది. మధుని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది. రాధకు డబ్బు అంటే ఎంత ప్రేమ ఉందో, భర్త అంటే అంతే ప్రేమ కానీ నిరంతరం ఐశ్వర్యవంతుల జీవితం మీద ఉన్న వ్యామోహం ఆమెలో డబ్బు మీద ఆశను మరింతగా పెంచుతుంది.
ఒక రోజు లత రాధ ముందు ఒక డీల్ పెడుతుంది. ‘కోటి రూపాయలు ఇస్తాను, నీ భర్తని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి, అతనిని నాతో పెళ్ళికి ఒప్పించాలి.’ అలా లత చాలా డబ్బు ఇస్తానని చెప్పడంతో రాధ తన భర్త మధును లతకి “అమ్మడానికి” ఒప్పుకుంటుంది. ఈ సంఘటన సినిమాలో అత్యంత సంచలనమైన మరియు భావోద్వేగమైన మలుపు.
కుటుంబం కోసం జీవించే మధు, మధుకు సహకరిస్తూ, పిల్లలని ప్రేమగా చూసుకునే ఇల్లాలు ఒక్కసారి డబ్బు మోహంలో పడి ఉన్న అదృష్టాన్ని చేజేతుల పోగొట్టుకోవదానికి రాధ నిర్ణయించుకుంటుంది.
రాధ నిర్ణయంతో, మధు తీవ్రంగా బాధపడతాడు. తనపై ప్రేమను డబ్బు కమ్మేసిందని, తనకంటే కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చిందని తెలుసుకుని మానసికంగా కుంగిపోతాడు.
Dabbu kosam bhartane ammeina bharya, డబ్బు పెట్టి పొరుగింటి భర్తను కొనుక్కున్న లత పాత్ర
లత మొదట ధనవంతురాలిగా మధును దక్కించుకోవాలని అనుకుంటుంది. కానీ మధు మంచితనం, అతనికి కుటుంబంపై గల ప్రేమను గమనించి, ఆమె క్రమంగా మారుతుంది. మధును అర్ధం చేసుకుంటుంది. అదే సమయంలో రాధ ఆడంబరాలతో అంటకాగుతూ, మధుకు మరియు పిల్లలకు దూరం అవుతుంది.
విలాసవంతమైన జీవితంలో గడిపిన రాధకు, లేటుగా జరిగిన నష్టం తెలిసివసుతుంది. సంపదలో నిజమైన ఆనందం లేదని తర్వాత గ్రహిస్తుంది. కుటుంబం, ప్రేమ, భర్త అనుబంధం కోల్పోయిన తర్వాత ఆమె ఒంటరితనంతో బాధపడుతుంది.
Dabbu kosam భర్తను అమ్మిన భార్య, డబ్బు పెట్టి భర్తను తెచ్చుకున్న అమ్మాయి కధ క్లైమాక్స్
చివరికి రాధ తన తప్పును తెలుసుకుంటుంది. డబ్బు కోసం ప్రేమను అమ్ముకోవడం ఎంత పెద్ద తప్పో అర్థమవుతుంది. మధును తిరిగి పొందాలని ప్రయత్నిస్తుంది.
లత కూడా మధు-రాధల మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని గౌరవిస్తుంది. చివరికి కుటుంబ విలువలు గెలుస్తాయి. రాధ తన భర్త ప్రేమే నిజమైన సంపద అని తెలుసుకుని మారిపోతుంది.
agra darshakua prasamalu pondina aite
ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా సందడి చేసిన శుభలగ్నం ముఖ్యమైన అంశాలు
అత్యాశ గల మద్య తరగతి మనిషిని, డబ్బు ఎలా మార్చేస్తుందో చూపించారు.
భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంత ముఖ్యమో వివరించారు. ఆలోచనల్లో అంతరం ఉన్నా, ప్రేమ వలన ప్రశాంతంగా బ్రతికేయోచ్చు కాని స్థాయి దాటి డబ్బుకోసం వెంపర్లాడితే జీవితం ఎలా తలకిందులు అవుతుందో? ఈ సినిమాలో చూపారు.
మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలను సహజంగా చూపించారు.
కామెడీ, ఎమోషన్, సంగీతం అన్నీ సమతుల్యంగా ఉన్నాయి.
సంగీతం మరియు గుర్తుండిపోయే విషయాలు
ఈ సినిమాకు సంగీతం కూడా S. V. Krishna Reddy అందించారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది.
Shubhalagnam ఇప్పటికీ తెలుగు కుటుంబ కథా చిత్రాలలో ఒక గుర్తుండిపోయే సినిమాగా భావిస్తారు. Dabbu kosam bhartane ammeina bharya పాత్రలో రాధగా ఆమనీ నటన అద్బుతం అయితే, మధు పాత్రలో జగపతిబాబు నటన చక్కగా ఉంటుంది, డబ్బు పెట్టి పొరుగింటి భర్తను కొనుక్కున్న లత పాత్రలో రోజా నటన ఆ కాలంలో మోడరన్ గర్ల్ పాత్రగా కనబడుతుంది.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డబ్బు అవసరమే కాని అది అవసరం వరకే. అవసరం దాటి ఆడంబరాల కోసం ఆరాటపడితే, సామాన్యుల జీవితంలో ఉండే ప్రశాంతత కోల్పోతామని సందేశం ఇచ్చిన తెలుగు సినిమా.
సినిమా షూటింగ్లో ‘గ్రీన్ మ్యాట్’ వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా?
మాయాబజార్ ఎందుకు క్లాసిక్ అయింది? ఆనాటి మేటి సినిమా
మొబైల్ ద్వారా సామాన్యునికి AI వలన ఉపయోగం ఏమిటి?