చిరంజీవి కెరీర్ హిట్స్ లో విజయ్ తండ్రి మూడు సినిమాలు తీసారా…? సోషల్ మీడియాలో వస్తున్న వార్త మీకు తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ ఈ ఏడాది తమిళ రాజకీయాల్లో, ఊహించని విధంగా సంచలనం సృష్టించారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా టీవీకే పార్టీనీ నిలబెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. దీంతో విజయ్ గురించి.. విజయ్ ఫాదర్ చంద్రశేఖర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అవి వెంటనే సోషల్ మీడియాలో సందడి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ కి తెలుగు సినిమా హీరోలతో ఉన్న అనుబంధం ఏంటనేది చర్చ అయితే. అందులో మెగాస్టార్ చిరంజీవితో విజయ్ తండ్రి ఎన్ని సినిమాలు తీసారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
చిరంజీవి కెరీర్ హిట్స్ లో విజయ్ తండ్రి మూడు సినిమాలు తీసారా…?
విజయ్ సినీ నేపథ్యం గల కుటుంబం నుండే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తల్లి శోభ ఒక సింగర్, రైటర్. విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత. తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, హిందీ సినిమాలకు పని చేశారు.
అలా తెలుగులో విజయ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారనే సంగతి ఎంతమందికే తెలుసు?
ఎస్‌ఏ చంద్రశేఖర్ కెరీర్ ప్రారంభంలో చిరంజీవితో చట్టానికి కళ్ళు లేవు సినిమా తీశారు అందులో లక్ష్మి, మాధవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ‘సట్టం ఒరు ఇరుత్తరై’ తమిళ మూవీకి రీమేక్.
2వ సినిమా పల్లెటూరి మొనగాడు చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 1983లో వచ్చి సందడి సందడి చేసింది. ఇది కూడా ‘నెంజిలె తునివిరుంతల్’ అనే తమిళ చిత్రానికి రీమేక్.
3వ సినిమా దేవాంతకుడు 1984లో సందడి చేసింది. చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నటించారు. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నారాయణరావు నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. చిరు కెరీర్లో దూసుకెళ్లడానికి తోడ్పడిన సినిమాలలో ఇదొకటి. ఐతే ఈ మూడు సినిమాలకు విజయ్ తల్లి శోభ స్వయంగా కథ అందించారు.
మొత్తానికి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ వార్తలో వాస్తవం ఉంది. విజయ్ తల్లిదండ్రులకు తెలుగులో చిరంజీవితో మంచి అనుబంధం ఉందనీ అంటారు.